
పెళ్లి తర్వాత సమంత బాట లోనే నడుస్తుంది కాజల్. ప్రియుడు గౌతం కిచ్లుని లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో పెళ్లాడిన కాజల్ పెళ్లి తర్వత సెలెక్టెడ్ సినిమాలకు సైన్ చేస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తున్న అమ్మడు పేపర్ బోయ్ డైరక్టర్ జయశంకర్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుందని తెలుస్తుంది. థ్రిల్లర్ కథాంశంతో వచ్చే ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. ఇదే కాకుండా మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సైన్ చేసిందట కాజల్. తథాగత సిఘా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఉమ సినిమాలో టైటిల్ రోల్ పోశిస్తుంది కాజల్.
ఉమ సినిమాను మిరాజ్ గ్రూప్ నిర్మిస్తుందని తెలుస్తుంది. ఉమ టైటిల్ తోనే సినిమాపై ఓ ఇంప్రెషన్ కలిగేలా చేశారు దర్శక నిర్మాతలు. పెళ్లి తర్వాత కూడా కాజల్ తన జోరు కొనసాగిస్తుదని చెప్పొచ్చు. కథ నచ్చాలే కాని సమంతలానే వెబ్ సీరీస్ లతో కూడా ప్రేక్షకులను మెప్పించాలని చూస్తుంది కాజల్.