
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అడివి శేష్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మేజర్ తో పాటుగా గూఢచారి 2 సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆమధ్య బాలీవుడ్ హీరోయిన్ తో అడివి శేష్ ప్రేమలో ఉన్నట్టు వార్తలు రాగా వాటిపై స్పందించని అడివి శేష్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తను ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు చెప్పిన అడివి శేష్ తను ఎవరన్నది చెప్పడానికి తన పర్మిషన్ తీసుకోలేదని అన్నాడు. ఆమెతో డిస్కస్ చేశాక ఆ వివరాలు చెబుతా అన్నాడు అడివి శేష్. తన యంగ్ టీం తో అద్భుతాలు సృష్టిస్తున్న అడివి శేష్ రానున్న రోజుల్లో ఇంకెన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.