యంగ్ డైరక్టర్ తో బాలకృష్ణ..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ పూర్తి కాగానే గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్య వర్షన్ క్రాక్ పార్ట్ 2 చూపించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. బాలకృష్ణ ఇమేజ్ కు తగినట్టుగా మాస్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి కూడా బాలయ్యతో సినిమాకు రెడీగా ఉన్నాడు. 

ఇదిలాఉంటే యువ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా బాలకృష్ణ కోసం ఓ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. తొలిప్రేమ, మిస్టర్ మజ్ ను, రంగ్ దే సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన వెంకీ బాలయ్య బాబు కోసం మంచి కథ రెడీ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ డైరక్షన్ లో బాలకృష్ణ హీరోగా ఈ సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అంతా ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.