మరోసారి 'భద్ర' కాంబినేషన్..!

మాస్ మహరాజ్ రవితేజ, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తుంది. 16 ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో భద్ర సినిమా వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బోయపాటి మొదటి సినిమాగా భద్ర సూపర్ క్రేజ్ తెచ్చింది. అప్పటినుండి బోయపాటి సినిమా సినిమాకు తన మార్క్ చూపిస్తూ వచ్చారు. ఇక మరోసారి రవితేజతో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమా కథ రవితేజ కోసం సిద్ధం చేశారట. కథ విన్న మాస్ రాజా ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. నూతన దర్శకుడు శరత్ డైరక్షన్ లో కూడా ఓ సినిమా వస్తుని. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను కాంబోలో సినిమా ఉంటుందని టాక్. మొత్తానికి భద్ర కాంబోతో మరో క్రేజీ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా.