
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ లీడర్ గా నటిస్తున్నాడు. సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఆహా, జీ5 ఓటిటి లతో చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే సాయి ధరం తేజ్ రిపబ్లిక్ మూవీ డిజిటల్ రిలీజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయన్నది చెప్పలేని పరిస్థితి. అందుకే ఏప్రిల్ సెకండ్ వీక్ నుండి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాలన్ని వాయిదా పడ్డాయి. జూలై, ఆగష్టు కల్లా పరిస్థితి అదుపులోకి వస్తే అప్పుడు థియేటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ వరకు ఆగలేక ఓటిటి బాట పడుతున్నాయి.