ఎనర్జిటిక్ స్టార్ కు లవర్ బోయ్ విలన్..?

ఎనర్జిటిక్ స్టార్ గా ఉన్న రామ్ కాస్త ఉస్తాద్ రామ్ పోతినేనిగా మారాడు. పూరీ ఇస్మార్ట్ శంకర్ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో అదే మాస్ ట్రాక్ లో వెళ్తున్నాడు రామ్. రీసెంట్ గా వచ్చిన రెడ్ కూడా హిట్ కొట్టడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఆసక్తి పెరిగింది. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లింగుసామితో రామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా వస్తుంది.

ఇక సినిమాలో హీరోకి తగ్గ విలన్ ను సెలెక్ట్ చేశారట చిత్రయూనిట్. తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ మూవీలో విలన్ గా ఒకప్పటి లవర్ బోయ్ మాధవన్ ను తీసుకున్నారట. తెలుగు, తమిళ ఆడియెన్స్ కు బాగా సుపరిచితుడైన మాధవన్ సోలో సినిమాలతో పాటుగా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు. అందుకే రామ్ కు మాధవన్ పర్ఫెక్ట్ విలన్ అని అతన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. లింగుసామి అనగానే తెలుగు ఆడియెన్స్ కు పందెంకోడి గుర్తుకొస్తుంది మరి రామ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.