
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత రూట్ మార్చేసింది. అదేంటి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాలు చేస్తానని చెప్పింది కదా ఇప్పుడు సడెన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా ఏంటి అంటే.. అలాంటిదేమి లేదు కాని అమ్మడు సెలెక్టెడ్ సినిమాలనే చేయాలని డిసైడ్ అయ్యిందట. కథా బలం ఉన్న సినిమాలు.. ఫీమేల్ సెంట్రిక్ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటుందట కాజల్. సాధ్యమైనంతవరకు కమర్షియల్ సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పాలని నిర్ణయించుకుందట.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తుంది కాజల్. ఈ రెండు సినిమాల తర్వాత కాజల్ కొత్త కథలకు.. లేడీ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటుందట. పెళ్లి తర్వాత సమంత కూడా ఇలానే సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ఇప్పటికీ రేసులో ఉంది. ఇప్పుడు కాజల్ కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తుంది.