మళ్లీ మొదటిస్థానంలో విజయ్ దేవరకొండ..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరోలందరిని వెనక్కి నెట్టేసి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలిచాడు. హైదరబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2021 సర్వేలో మన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ టాప్ ప్లేస్ లో నిలిచాడు. 2018 నుండి విజయ్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో రౌడీ ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు విజయ్ దేవరకొండ.    

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో చేయాల్సి ఉంది. సుకుమార్ తో చేసే ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని టాక్. ఇక మీదట విజయ్ దేవరకొండ కూడా ప్రభాస్, అల్లు అర్జున్ రూట్ లో చేస్తే పాన్ ఇండియా సినిమానే అనేలా ఉన్నాడు.