
మళయాళ భామ నివేదా థామస్ తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాదు పాత్ర ప్రాధాన్యతని బట్టి సినిమాలు చేస్తున్న అమ్మడు ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సోలో హీరోయిన్ గానే కాకుండా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేస్తూ వస్తున్న నివేదా థామస్ ఈమధ్య డైరక్షన్ కోర్స్ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది.
ఫ్యూచర్ లో డైరక్షన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా అంటే అవును కచ్చితంగా డైరక్షన్ చేస్తా ముందు షార్ట్ ఫిల్మ్ స్ చేస్తా ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తా అంటుంది అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్ తన డ్యాన్సింగ్ టాలెంట్ తో ఫాలోవర్స్ ను మెప్పిస్తుంది. అంతేకాదు ఇన్ స్టాగ్రా రీల్స్ లో కూడా అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుంది.