
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కథ అందిచారు. ఈ సినిమా గురించి ఎక్స్ క్లూజివ్ విషయాలను రీసెంట్ గా ఓ టాక్ షో ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో విజయేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకు కథ రాయాల్సి వస్తే అన్న ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ సినిమాకు కథ రాయక్కర్లేదని అన్నారు. ఆయన ఇదివరకు సినిమాల్లో అక్కడక్కడ సీన్లు తీసి పేర్లు మార్చేస్తే చాలని అన్నారు. పవన్ సినిమా చూసే వాళ్లకు కథ అక్కర్లేదని.. పవన్ పాటలు పాడాలి.. అమ్మాయిలతో సరదాగా ఆడుకోవాలి.. విలన్లను ఇరగ్గొట్టాలి ఇవి ఉంటే చాలు కథ అవసరం లేదని అన్నారు విజయేంద్ర ప్రసాద్.
అయితే ఆయన చెప్పిన వర్షన్ పవన్ ఫ్యాన్స్ ఆయన్ను ఎలాగైనా చూస్తారన్న యాంగిల్ లో చెప్పారు. ముఖ్యంగ పవర్ స్టార్ కు కథతో అవసరం లేదన్నట్టుగా చెప్పారు. కాని విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ లో ఏదో తెలియని అర్ధం ఉందని అభిప్రాయపడుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.