మహేష్ కు విలన్ అతనేనా..?

సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. బ్యాంక్ స్కాం ల నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న దాని మీద క్లారిటీ వచ్చింది. కన్నడ స్టార్ ఉపేంద్ర, కోలీవుడ్ హీరో అరవింద స్వామి ఇలా ముగ్గురు నలుగురి పేర్లు వినపడ్డాయి. అయితే ఫైనల్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని మహేష్ విలన్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

మహేష్ వర్సెస్ అర్జున్.. హీరోకి ఈక్వల్ గా విలన్ రోల్ ఉంటుందని. అర్జున్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారని తెలుస్తుంది. ఒకప్పటి హీరోగా తెలుగులో కూడా మంచి సినిమాలు చేసిన అర్జున్ ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కు పరిమితమయ్యారు. మహేష్ సకారు వారి పాట సినిమాతో అర్జున్ కూడా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.