
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ సినిమాను మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా ఓ డైలాగ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. త్వరలో సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుతుంది. అంతేకాదు జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. అఖండ నుండి 1:30 నిమిషం టీజర్ వస్తుందని తెలుస్తుంది.
బోయపాటి, బాలయ్య కాంబోలో సిం హా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమాగా వస్తున్న ఈ అఖండ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.