
అల వైకుంఠపురములో లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో భారీ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 70 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. తెలుగులో 50 కోట్ల వరకే హయ్యెస్ట్ అనుకోగా పుష్ప కోసం బన్నీ ఏకంగా 70 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. చూస్తుంటే అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.