
సౌత్ సినీ పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది ప్రియమణి. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ అమ్మడు తగిన పాత్ర ఇస్తే అదరగొడుతుందని తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కొద్దిగా స్పీడ్ తగ్గించిన ప్రియమణి ఈటివి డ్యాన్స్ షో ఢీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. లేటెస్ట్ గా ప్రియమణి విరాటపర్వం, వెంకటేష్ నారప్ప సినిమాల్లో నటిస్తుంది. విక్టరీ వెంకటేష్ తో ప్రియమణి మొదటిసారి జోడీ కడుతుంది. అయితే ఈ అవకాశం గురించి మీడియాతో మాట్లాడిన ప్రియమణి వెంకటేష్ తో నటించే ఛాన్స్ అంతకుముందు రెండు సార్లు వచ్చినా సరే కుదరలేదు కాని ఈసారి వెంకటేష్ తో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నది ప్రియమణి.
కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా నారప్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. నారప్పతో పాటుగా వేణు ఊడిగుల డైరక్షన్ లో రానా, సాయి పల్లవి నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ప్రియమణి నటిస్తుంది.