
యువ హీరో నిఖిల్ రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో ఒకటి సుకుమార్ కథతో 18 పేజెస్ అంటూ లవ్ స్టోరీ ఒకటి కాగా.. మరొకటి సూపర్ హిట్ సినిమా సీక్వల్ కార్తికేయ 2 చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో నిఖిల్ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. రెండు సినిమాలు డిఫరెంట్ సబ్జెక్ట్ లతో వస్తున్నాయి. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజెస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాను కుమారి 21ఎఫ్ ఫేం సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
నిఖిల్ బర్త్ డే సందర్భంగా కార్తికేయ 2 నుండి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న కార్తికేయ 2 సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. యువ హీరోలంతా వరుస హిట్లతో దూసుకెళ్తుంటే రేసులో వెనకపడ్డ నిఖిల్ రాబోయే రెండు సినిమాలతో సత్తా చాటాలని చూస్తున్నాడు.