బిజినెస్ మెన్ తో ప్రణీత సుభాష్ మ్యారేజ్..!

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ యంగ్ బిజినెస్ మెన్ నితిన్ రాజుని పెళ్లాడింది. తెలుగులో సోలో హీరోయిన్ గా కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత సుభాష్ ఈమధ్య ఆ అవకాశాలను నోచుకోలేదు. ఇక ఎలాగు సినిమా ఛాన్సులు రావట్లేదు కదా అని పెళ్లికి సరే అనేసింది. కొన్నాళ్లుగా తెలిసిన స్నేహితుడు నితిన్ రాజ్ తో ప్రణీత ఏడు అడుగులు నడిచింది. లాస్ట్ ఇయర్ కరోనా టైం లో లేడీ సోనూ సూద్ గా కొంతమందికి సాయం చేసిన ప్రణీత కరోనా సెకండ్ వేవ్ టైం లో కూడా కొందరి ఆకలి బాధ తీర్చింది.

ఇలాంటి టైం లోనే అన్ని కుదరడంతో పెళ్లి పీఠలెక్కింది ప్రణీత. కేవలం కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. నా పెళ్లి ఎంత సింపుల్ గా జరగాలని భావించానో అలానే జరిగిందని చెప్పుకొచ్చింది ప్రణీత. అయితే ఇంత సడెన్ గా అమ్మడు పెళ్లి చేసుకోవడం పట్ల తెలుగు ఆడియెన్స్ మాత్రం షాక్ అయ్యారు.