
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సరైనోడు. బన్నీ మాస్ ఫాలోయింగ్ ను డబుల్ చేసిన ఈ సినిమా వసూళ్లను అదరగొట్టింది. ఇక మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివతో మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అందుకే బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
బోయపాటి శ్రీను కూడా బాలయ్యతో అఖండ చేస్తున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ను కలిసి ఓ కథ వినిపించాడట బోయపాటి శ్రీను కథ నచ్చిన బన్నీ వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ వస్తాయని చెబుతున్నారు. ఈ కాంబో సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది.