
సూపర్ స్టార్ రజినికాంత్ రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రీసెంట్ గా అన్నాత్తే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రజిని చిత్రయూనిట్ తో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారని తెలుస్తుంది. త్వరలోనే తన రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారట రజిని. అయితే ఈలోగా సాధ్యమైనంత వరకు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. 1970 నుండి రజినికాంత్ సినిమాలు చేస్తున్నారు.
సాధారణ బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ గా రజిని ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తిని నింపింది. రజిని సినిమాలు ఆపేయడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఆరోగ్యం సహకరించే దాకా సినిమాలు చేస్తానని రజిని చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలో మరోసారి రజిని అమెరికా వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకుంటారని తెలుస్తుంది.