కింగ్ నాగార్జున సినిమాలో రష్మి..!

కింగ్ నాగార్జున హీరోగా గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇక సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో జబర్దస్త్ యాంకర్ రష్మి నటిస్తుందని తెలుస్తుంది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన గుంటూర్ టాకీస్ సినిమాలో నటించింది రష్మి ఆ పరిచయంతోనే ఇప్పుడు నాగార్జున సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.

జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో ఫుల్ బిజీ అయ్యింది అనసూయ. ఇప్పుడు అనసూయకు పోటీగా రష్మి అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది. రష్మి కూడా సినిమాల్లో బిజీ అయితే మాత్రం జబర్దస్త్ కు కొత్త యాంకర్ల అవసరం పడే అవకాశం ఉన్నట్టే.