
అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ కెరియర్ లో వెనకపడ్డ విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ సంస్థ తన వెనక ఉన్నా సరే హీరోగా స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెంకప పడ్డాడు. ఏబిసిడి మూవీ తర్వాత తన నెక్స్ట్ సినిమాకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ లేటెస్ట్ గా సినిమా ప్రీ లుక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ జోడీగా ఈ సినిమా వస్తుంది. సినిమా నుండి ప్రీ లుక్ గా రొమాంటిక్ స్టిల్ రిలీజ్ చేశారు.
ఇన్నాళ్లు రకరకాల ప్రయత్నాలు చేసిన అల్లు శిరీష్ కూడా రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి యూత్ ఆడియెన్స్ ను మెప్పించాలంటే వారికి నచ్చే సీన్స్ ఉండాల్సిందే. అందుకే అల్లు శిరీష్ రాబోయే సినిమాలో యువతని మెప్పించే సీన్స్ తో సినిమా చేస్తున్నడట. ప్రీ లుక్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అల్లు శిరీష్ ఫస్ట్ లుక్ తో ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాకు డైరక్టర్ మిగతా డీటైల్స్ మే 30న తెలుస్తాయి.