మరోసారి ఎం.సి.ఏ కాంబో..!

నాచురల్ స్టార్ నాని, వేణు శ్రీరాం కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఎం.సి.ఏ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి అదే ప్రొడక్షన్ లో పవర్ స్టార్ తో సినిమా చేశాడు వేణు శ్రీరాం. వకీల్ సాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు శ్రీరాం తన నెక్స్ట్ సినిమాను నాచురల్ స్టార్ నానితో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అసలైతే వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమా కొద్దిగా టైం పట్టేలా ఉంది. బన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఐకాన్ సినిమాపై క్లారిటీ రాలేదు. అందుకే ఈ గ్యాప్ లో నానితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట వేణు శ్రీరాం. నానికి కథ నచ్చి ఓకే అంటే మరోసారి ఎం.సి.ఏ కాంబో రిపీట్ అవుతుంది.