సంబంధిత వార్తలు

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మధవ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ సూపర్ హిట్ మూవీ కర్ణన్ సినిమా హీరోయిన్ రజిష విజయన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ధనుష్ హీరోగా వచ్చిన కర్ణన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది మళయాళ భామ రజిష విజయన్. మళయాళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మళయాళ భామ తెలుగులో రవితేజ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.