ఖైదీ సీక్వల్ వస్తుందా..?

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖైదీ. 2019లో వచ్చిన ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు ఖైదీ సీక్వల్ పై క్లారిటీ ఇచ్చారు. ఖైదీ సినిమా సీక్వల్ కన్ ఫాం గా ఉంటుందని అన్నారు.

తెలుగులో కూడా కార్తీ ఖైదీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ ఆయనకు ఉన్న క్లాస్ ఫాలోయింగ్ ను ఖైదీ సినిమా పూర్తిగా మారేసింది. ఖైదీ సీక్వల్ తప్పకుందా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. మరి ఖైదీ సీక్వల్ ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.