
ఉప్పెన సినిమాతో తెలుగులో సూపర్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. బుచ్చి బాబు డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోయిన్ కృతి శెట్టికి మంచి క్రేజ్ వచ్చింది. ఉప్పెన హిట్ అవడంతో కృతి శెట్టి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే నానితో శ్యాం సింగ రాయ్ తో పాటుగా సుధీర్ బాబుతో సినిమా చేస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్ కు రెడీ అవగా సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని టాక్. వరుస క్రేజీ సినిమాలతో కృతి శెట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తాచాటేలా ఉందని తెలుస్తుంది.