
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోని పవన్ సినిమా అంటే గుర్తొచ్చే సినిమాల్లో గబ్బర్ సింగ్ ఒకటి. ఖుషి తర్వాత పదేళ్లుగా హిట్ సినిమాకు దూరమైన పవర్ స్టార్ కు తన పవర్ ఏంటో చూపించేలా చేసిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలాంటి సినిమా కోరుతున్నారో అలాంటి సినిమాను ఇచ్చాడు.
ఇక లేటెస్ట్ గా వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని టాక్. ఒక పాత్రలో కాలేజ్ లెక్చరర్, మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారట. ఈ రెండు పాత్రల్లో పవన్ కళ్యాణ్ మరోసారి తన ఫ్యాన్స్ ను అలరిస్తారని తెలుస్తుంది. రీసెంట్ గా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ క్రిష్ డైరక్షన్ లో హరిహర వీరమల్లు, శరత్ చంద్ర డైరక్షన్ లో అయ్యప్పనుం కోషియం రీమేక్ లో నటిస్తున్నారని తెలిసిందే.