
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రెండు వారల క్రితం కొవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. రెండు వారాల హోం క్వారెంటైన్ ను పూర్తి చేసుకున్న ఎన్.టి.ఆర్ ఫైనల్ కరోనాని జయించారు. లేటెస్ట్ గా కొవిడ్ టెస్ట్ చేయించుకున్న ఎన్టీఆర్ కు నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. తను కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. చికిత్స అందించిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, కజిన్ కిమ్స్ డాక్టర్ వీరుకి కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. టెనెట్ డయాగ్నస్టిక్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పారు తారక్. తన ఆరోగ్యం గురించి వారు తీసుకున్న శ్రద్ధ కోలుకోవడానికి బాగా ఉపయోగపడ్డదని అన్నారు.
కొవిడ్ 10 ని చాలా సీరియస్ గా తీసుకోవాలని.. జాగ్రత్తలు, పాజిటివ్ మైండ్ తో ఈ వ్యాధిని జయించవచ్చని అన్నారు ఎన్.టి.ఆర్. మన సంకల్ప బలమే మన అతిపెద్ద ఆయుధం.. ధైర్యంవా ఉండండై.. భ్యపడకూడదు.. మాస్కులు ధరించండి.. ఇంట్లోనే ఉండండి అని ఎన్.టి.ఆర్ ట్వీట్ చేశారు.