బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూత..!

బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ రామ్ లక్ష్మణ్ గా పేరు గాంచిన ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ పాటిల్ (79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం నాగ్ పూర్ లో తుదిశ్వాస విడిచారు. సంగీత దర్శకుడు రామ్ తో జతకట్టి రామ్ లక్ష్మణ్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు విజయ్ పాటిల్. కొంతకాలం క్రితం రామ్ మరణించడంతో తన పూర్తి పేరుని రామ్ లక్ష్మణ్ గా మార్చుకున్నారు. రామ్ లక్ష్మణ్ పేరుతో ఆయన ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. 

హిందీ, మరాఠీ, భోజ్ పురి తో పాటుగా దాదాపు 150 సినిమాలకు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు రామ్ లక్ష్మణ్. ఆయన స్వరపరచిన మైనే ప్యార్ కియా (1989) సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.