తెలంగాణ గాయకుడు 'జై' శ్రీనివాస్ మృతి..!

ప్రముఖ తెలంగాణా గాయకుడు జై శ్రీనివాస్ కరోనాతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా కరోనాతో పోరాడుతున్న ఆయన సికింద్రాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తేజ డైరక్షన్ లో వచ్చిన జై సినిమాలో దేశం మనదే.. తేజం మనదే ఎగురుతున్న జండా మనదే పాటతో పాపులర్ అయ్యారు నేరేడుకొమ్మ శ్రీనివాస్. ఆ పాట తర్వాత ఆయన పేరు జై శ్రీనివాస్ గా మారింది. తెలుగులో ఎన్నో పాటలను పాడారు శ్రీనివాస్. సినిమాలతో పాటుగా ప్రైవేట్ ఆలబ్మ్, షార్ట్ ఫిల్మ్ లకు, వెబ్ సీరీస్ లకు ఆయన పాటలు పాడటం విశేషం.

తెలంగాణా గాయకుడిగా పాపులారిటీ తెచ్చుకున్న జై శ్రీనివాస్ 20 రోజులుగా కరోనాతో పోరాడారు. ఆయన చికిత్స కోసం దాదాపు 40 లక్షల దాకా ఖర్చు పెట్టినా లాభం లేకుండాపోయింది. శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కే.సి.ఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సిఎం కే.సి.ఆర్.