ప్రముఖ పి.ఆర్.ఓ.. నిర్మాత బి.ఏ రాజు కన్నుమూత..!

తెలుగు చలనచిత్ర రంగంలో సీనియర్ జర్నలిస్ట్.. పి.ఆర్.ఓ .. నిర్మాత బి.ఏ రాజు శుక్రవారం రాత్రి హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. తెలుగు సినిమా పరిశ్రమలో సినీ జర్నలిస్ట్ గా సూపర్ హిట్ మేగజైన్ అధినేతగా బి.ఏ రాజు అందరికి సుపరిచితుడు. టాలీవుడ్ లో స్టార్ పి.ఆర్.ఓ గా బి.ఏ రాజుకి మంచి పేరు ఉంది. ఒక వర్గంతో సంబంధం లేకుండా అందరి హీరోల సినిమాలను ప్రమోట్ చేశాడు బి.ఏ రాజు. 

శుక్రవారం మరణించడానికి నాలుగు గంటల ముందు కూడా ప్రభాస్ అడవి రాముడు సినిమాకు సంబందించి 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ట్వీట్ చేశారు బి.ఏ రాజు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లే క్రమంలోనే రాజు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఒకప్పటి సూపర్ స్టార్స్ నుండి ఇప్పటి యువ హీరోల వరకు పి.ఆర్ గా ఉంటూ వారి సినిమాలకు మంచి ప్రమోషన్స్ అందిస్తారు బి.ఏ రాజు. రెండేళ్ల క్రితం బి.ఏ రాజు భార్య బి. జయ మృతి చెందారు. బి.ఏ రాజు మృతి పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. చిరంజీవి, బ్నాలకృష్ణ, మహేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ ఆయనతో  తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.