తమిళ నటుడికి చిరంజీవి సాయం..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ప్రముఖ తమిళ నటుడు పొన్నాంబళం కు జరిగిన కిడ్నీ ట్రాన్స్ మార్పిడి శస్త్ర చికిత్సకు చిరంజీవి 2 లక్షల సహాయం అందించారని తెలుస్తుంది. 80, 90ల సినిమాల్లో తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా మెప్పించారు పొన్నాంబళం. చిరుతో కూడా ఆయన రెండు సినిమాల్లో నటించారు. పొన్నాంబళం కిండీ ట్రాన్స్ ప్లాంటేషన్ గురించి తెలుసుకున్న చిరంజీవి అతనికి 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు.

అయితే ఈ విషయాన్ని నటుడు పొన్నాంబళం స్వయంగా వెల్లడించారు. చిరు నుండి సాయం అందుకున్న పొన్నాంబళం ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని.. ఈ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు. కరోనా లాక్ డౌన్ టైం లో సీసీసీని ఏర్పాటు చేసి సినీ కార్మీకులకు నిత్యావసరాలు అందించారు చిరు. ఇక లేటెస్ట్ గా జిల్లాకో ఆక్సీజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.  ఇటీవల కరోనాతో మృతి చెందిన ప్రముఖ సినీ జర్నలిస్ట్ టి.ఎన్.ఆర్ ఫ్యామిలీకి కూడా చిరంజీవి లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేశారు. సీనియర్ యాక్టర్ పవలా శ్యామలా కూడా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న చిరంజీవి ఆమెకు లక్ష రూపాయలను పంపించారు.