చైతు.. సమంత.. మరోసారి..!

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో సూపర్ ఫాంలో ఉన్నది ఎవరు అంటే నాగ చైతన్య, సమంత అని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత చైతు కెరియర్ లో కూడా లక్ తీసుకొచ్చింది సమంత. మజిలీ, వెంకీమామ హిట్లతో చైతన్య సూపర్ ఫాం లో ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా ప్రీక్వెల్ మూవీ బంగర్రాజులో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. 

కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటుగా చైతన్య కూడా నటిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సమంత నటిస్తుందని టాక్. చైతు, సమంతలది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందించాయి. అందుకే బంగార్రాజు సినిమాలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.