హరిహర వీరమల్లు అదిరిపోయే అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం.రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. పవన్ కెరియర్ లో వైవిధ్యమైన సినిమాగా ఇది నిలుస్తుందని చెప్పొచ్చు. శాంపిల్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు క్రిష్. ఇక ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట.

సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ కు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న సినిమాలో గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండాలని చూస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తన ప్రతిభ చాటిన క్రిష్ హరిహర వీరమల్లు సినిమాని కూడా అంతకుమించి ఉండేలా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా నుండి వస్తున్న ఈ అప్డేట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.