
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.జయరాం కరోనాతో కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు జయరాం. తెలుగుతో పాటు మళయాళ చిత్రాలకు ఆయన వర్క్ చేశారు. ఎన్.టి.ఆర్, కృష్ణ, ఏయన్నార్, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు జయరాం పనిచేశారు.
మళయాళంలో కూడా మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపీ వంటి స్టార్ హీరోల సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చిన పెళ్లిసందడి, మేజర్ చంద్రకాంత్ సినిమాలకు జయరాం సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. జయరాం మృతి పట్ల సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.