విజయ్ దేవరకొండ @ 12 మిలియన్స్..!

రౌడీహీరో విజయ్ దేవరకొండ మరో క్రేజీ రికార్డ్ అందుకున్నాడు. సౌత్ స్టార్ హీరోలను అందరిని దాటేశాడు. ఇన్ స్టాగ్రాం లో విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా 12 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ చేశాడు. సౌత్ హీరోల్లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా విజయ్ దేవరకొండ క్రేజీ రికార్డ్ సాధించాడు. విజయ్ దేవరకొండ తర్వాత అల్లు అర్జున్ 11.80 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ ఇమేజ్ తోనే డియర్ కామ్రేడ్ సినిమాను సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ డైరక్టర్ తో ప్లానింగ్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.