శ్యామ్ సింగ రాయ్ సెట్ డ్యామేజ్.. నిర్మాతలకు నష్టం ఎన్ని కోట్లంటే..!

నాచురల్ స్టార్ నాని హీరోగా ట్యాకీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ను కలకత్తాలోనే షూట్ చేయాలని అనుకోగా కరోనా వల్ల అది కుదరలేదు.

ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ సెట్ వేశారు చిత్రయూనిట్. అయితే హైదరాబాద్ లో పడుతున్న వర్షాల వల్ల ఆ సెట్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో అత్యంత కీలకం కానున్న ఈ సెట్ ను ఆరు కోట్లతో రూపొందించారని తెలుస్తుంది. వర్షం వల్ల సెట్ మొత్తం డ్యామేజ్ అయ్యిందట. మళ్లీ సెట్ ను వాడుకునేందుకు మరో రెండు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. ఇది ఒకరకంగా నిర్మాతకు అనవసర ఖర్చే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాని లుక్స్ డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తుంది.