
కె.జి.ఎఫ్ స్టార్ యశ్ ఇప్పుడు సౌత్ సెన్సేషనల్ హీరో అయ్యాడు. కె.జి.ఎఫ్ ముందు వరకు అతనొక కన్నడ హీరో మాత్రమే కాని ఎప్పుడైతే కె.జి.ఎఫ్ రిలీజైందో అప్పటి నుండి అతను సథరన్ క్రేజీ హీరో అయ్యాడు. కె.జి.ఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా అంతకుమించిన అంచనాలతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుంది. డైరక్టర్ ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కె.జి.ఎఫ్ 2 నుండి రిలీజైన టీజర్ అంచనాలను తారాస్థాయిలో ఏర్పడేలా చేసింది.
కె.జి.ఎఫ్ 2 తర్వాత యశ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానికి సంబందించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తో యశ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే కథాచర్చలు ముగిశాయని తెలుస్తుంది. పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత యశ్ తో సినిమా ఉంటుందని టాక్.