
కరోనా క్రైసెస్ టైం లో సీ.సీ.సీని ఏర్పాటు చేసి సినీ పరిశ్రమలోని కార్మికులకు నిత్యావసరాలను అందించారు మెగాస్టార్ చిరంజీవి. అందరి సహకారంతో సీ.సీ.సీ ద్వారా చిరు చేసిన సాయం సినీ కార్మీకులకు ఎంతగానో ఉపయోగపడ్డది. అంతేకాదు సెకండ్ వేవ్ కోసం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహించారు చిరంజీవి. ఇక లేటెస్ట్ గా మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు మెగాస్టార్.
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే జిల్లాల వారిగా ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు చిరంజీవి. తెలుగు రెండు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులతో కలిసి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ల ఏర్పాట్ల పనులు మొదలు పెడాతారని తెలుస్తుంది. చిరంజీవి ప్రోత్సాహంతో రాం చరణ్ ఆధ్వర్యంలో జిల్లాల వారిగా ఆక్సిజన్ బ్యాంక్ ల ఏర్పాట్లు జరుగుతాయని తెలుస్తుంది.