
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం F3, గని సినిమాలు చేస్తున్నాడు. కొత్త కథలతో మెగా హీరోల్లో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకుంటున్నాడు వరుణ్ తేజ్ ఇక లేటెస్ట్ గా టాలెంటెడ్ డైరక్టర్ ప్రవీణ్ సత్తారుతో వరుణ్ తేజ్ సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. గరుడవేగ సినిమాతో తన ప్రతిభ చాటిన ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం కింగ్ నాగార్జునతో మూవీ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాగానే వరుణ్ తేజ్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.
వరుణ్ తేజ్ మూవీ పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వల్ల సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక ప్రవీణ్, వరుణ్ తేజ్ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.