
అలనాటి తెలుగు దర్శక నిర్మాత యు.విశ్వేశ్వర రావు గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఈరోజు ఉదయం ఆయన మరణించారు. ఎన్.టి. రామారావుకి ఆయన వియ్యంకులు అవుతారు. దర్శక నిర్మాతగా ఆయన ప్రేక్షకులను ఎన్నో మంచి సినిమాలు అందించారు. రచన పట్ల ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది.. చిన్ననాటి నుండి నాటకాల మీద ఉన్న ఆసక్తే ఆయన్ని సినిమాల వైపు వెళ్లేలా చేశాయి. కంచుకోట, దేశోద్ధారకులు, పెత్తందార్లు సినిమాలను ఆయన నిర్మించారు.
తీర్పు, మార్పు, నగ్న సత్యం, కీర్తి కాంత కనకం, హరిశ్చంద్రుడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. పెళ్లిళ్ల చదరంగం, కీర్తి కాంత కనకం సినిమాలకు ఆయనకు నంది అవార్డులు వచ్చాయి. నేషనల్ అవార్డ్ సెంట్రల్ జ్యూరీ సభ్యుడిగానే కాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలను నిర్వహించారు. దర్శక నిర్మాత విశ్వేశ్వర రావు మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అపించారు.