
రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న RRR సినిమా నుండి మరో క్రేజీ పోస్టర్ రిలీజైంది. ఈరోజు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. అంతకుముందు వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా కొమరం భీమ్ లుక్ లో ఎన్.టి.ఆర్ బళ్లెంతో గురి పెట్టిన పోస్టర్ అదిరిపోయిందని చెప్పొచ్చు.
బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఆ సినిమాకు మించి అనేలా ఉంటుందని అనిపిస్తుంది. ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడం ఫైటర్స్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో కల్పిత కథతో ఈ సినిమా వస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్, రామరాజు పాత్రలో చరణ్ తమ నట విశ్వరూపం చూపించనున్నారని తెలుస్తుంది.