మంచు మనోజ్.. 'మంచి' మనసు..!

కరోనా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైం లో ప్రజలకు అండగా మేమున్నాం అని ముందుకు వస్తున్నారు సినీ తారలు. ఇప్పటికే చాలామంది స్టార్స్ కొవిడ్ బాధితులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేస్తుండగా అదే దారిలో మంచు హీరో మనోజ్ కూడా కొవిడ్ బాధితులకు అండగా ఉండేందుకు సిద్ధమయ్యాడు.

మే 20 గురువారం పుట్టినరోజు సందర్భంగా వైరస్ వల్ల ప్రభావితమైన వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు మంచు మనోజ్. బర్త్ డే రోజున అభిమానులు, మిత్రులతో కలిసి కొవిడ్ వల్ల ప్రభావితం అయిన 25 వేల కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు అందించనున్నామని చెప్పారు మంచు మనోజ్. మనోజ్ చేస్తున్న ఈ సహాయానికి నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ సొంత నిర్మాణంలో అహం బ్రహ్మస్మి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.