స్టాఫ్ కి వ్యాక్సిన్ వేయించిన అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా కరోనా నుండి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా సోకిన బన్నీ రెండు వారాల సెల్ఫ్ క్వారెంటైన్ టైం తర్వాత కరోనాని జయించారు. ఇక లేటెస్ట్ గా తన స్టాఫ్ అందరితో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ కు వ్యాక్సిన్ వేయించారట అల్లు అర్జున్. తన స్టాఫ్ లో 45 ఏళ్లు పై బడిన వారికి.. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కు వ్యాక్సినేషన్ ను ఏర్పాటు చేయించారు అల్లు అర్జున్.

తన స్టాఫ్ ను చాలా జాగ్రత్తగా చూసుకునే బన్నీ వారికి ఎలాంటి అవసరం వచ్చినా సహాయం చేస్తాడు. తన టీం లో ఉన్న 45 ప్లస్ వారికి వ్యాక్సినేషన్ చేయించారని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.