
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ సూపర్ హిట్ తో మళ్లీ ఫాం లోకి వచ్చాడు డైరక్టర్ గోపీచంద్. బాలకృష్ణతో తీసే సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా ఒక హీరోయిన్ గా చెన్నై భామ త్రిష కృష్ణన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాలయ్య సరసన లయన్ సినిమాలో నటించింది త్రిష. మరోసారి బాలకృష్ణ సరసన నటిస్తుందని తెలుస్తుంది.
అఖండ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది. సినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలు పెంచగా సింహా, లెజెండ్ తరహాలోనే అఖండ మూవీ కూడా నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్.