
ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, తారక్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా కోసం మరో మళయాళ స్టార్ ను తీసుకొస్తున్నాడట కొరటాల శివ.
మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి ఈ సినిమాలో కీలక పాత్ర ఇస్తున్నారట. జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమా సక్సెస్ లో మోహన్ లాల్ కూడా భాగమయ్యారు. ఈసారి మమ్ముట్టిని వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు కొరటాల శివ. కంటెంట్ బాగుండి పాత్ర ప్రాధాన్యత ఉంటే మమ్ముట్టి తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం కన్ ఫాం. యాత్ర తర్వాత మముట్టి తెలుగులో చేసే సినిమా ఇదే అవుతుంది.