
జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ క్రేజ్ తోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ఓ ప్రయత్నం చేశాడు. రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా నిరాశపరచింది. మళ్లీ అదే డైరక్టర్ తో సుధీర్ ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా గాలోడు అని ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా గాలోడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
సినిమా కంటెంట్ ఎలా ఉన్నా సుధీర్ సినిమా టైటిల్ గాలోడు అని వినగానే ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఇలాంటి టైటిల్స్ పెట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. పాజిటివ్, నెగటివ్ ఇలా ఎలా అయినా సినిమా గురించి మాట్లాడితే చాలు అనుకునేలా గాలోడు టైటిల్ పెట్టినట్టు ఉన్నారు. మరి సుధీర్ చేస్తున్న ఈ రెండో ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.