సోనూ సూద్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ..!

కరోనా టైం లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. ఎక్కడ ఏ అవసరం ఉన్నా అందరికి అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్న రియల్ హీరో సోనూ సూద్ ను స్క్రీన్ మీద కూడా హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరక్టర్ క్రిష్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా పూర్తి చేసిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సోనూ సూద్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సోనూ సూద్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట క్రిష్. కథ విన్న సోనూ సూద్ వెంటనే సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. స్క్రీన్ మీద విలన్ గా కనిపించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో స్టార్ హీరోల కన్నా కూడా గొప్ప మనసు ఉన్న వాడుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో కరోనా బాధితులకు ఆయన చేస్తున్న హెల్ప్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.