
రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కొమరం భీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే వచ్చిన కొమరం భీం, రామరాజు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక మే 20 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. దీనికి సంబందించిన అప్డేట్ చిత్రయూనిట్ నుండి వచ్చింది.
ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ కు సంబందించిన ఇంటెన్స్ లుక్ ను మే 20 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నామని ఆర్.ఆర్.ఆర్ యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా వాయిదా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఎప్పుడు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.