వేడుకలొద్దు...జాగ్రత్తగా ఉంటే చాలు: జూ.ఎన్టీఆర్

రేపు (గురువారం) యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ బహిరంగ లేఖ వ్రాశారు. “మీ అందరి అభిమానం...ఆశీస్సులతో త్వరలోనే నేను కోవిడ్‌ను జయిస్తాను. రేపు నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఎటువంటి వేడుకలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంటూ కర్ఫ్యూ నియమాలు, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతిపెద్ద కానుక...” అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.