కోలీవుడ్ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌ అస్వస్థత

తమిళ సినీ పరిశ్రమకు కరోనా మహమ్మారి శాపంగా మారింది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పది కొలుకొంటుండగా మరికొందరు మరణించారు. ప్రముఖ నటుడు, డీఎండీకె పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌ ఈరోజు ఉదయం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కెప్టెన్ విజయ్‌కాంత్‌ గత ఏడాది కరోనా బారినపడి చికిత్స తీసుకొని కోలుకొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.