మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు విజ్ఞప్తి

మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను లాక్‌డౌన్‌ అమలుకు ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బయటికి వస్తే డబల్ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనా కారణంగా ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారని ఇది చాలా బాధాకరమని అన్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినా కూడా కంగారు పడకుండా ఒంటరిగా రూమ్‌లో ఉంటూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతూ కరోనా బారినుండి బయటపడవచ్చని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న నెల తర్వాత రోగుల శరీరంలో రోగనిరోదక శక్తి కలిగిన యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ప్లాస్మా దానానికి ముందుకు రావాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.